Text copied!
Bibles in Telugu

కీర్తన 56:1-9 in Telugu

Help us?

కీర్తన 56:1-9 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

1 ప్రధాన సంగీతకారుని కోసం. యోనతేలెం రెహూకిం అనే రాగంతో పాడేది. ఫిలిష్తీయులు దావీదును గాతులో పట్టుకున్నపుడు అతడు రాసిన కీర్తన. దేవా, నన్ను కరుణించు. మనుషులు నన్ను మింగివేయాలని చూస్తున్నారు. వారు రోజంతా నా మీద పోరాడుతూ నన్ను అణచివేస్తున్నారు.
2 గర్వంగా నాతో పోరాడేవారు అనేకులున్నారు. రోజంతా నా కోసం కాపు కాసి నన్ను మింగాలని చూస్తున్నారు.
3 నాకు భయం కలిగిన రోజున నిన్ను ఆశ్రయిస్తాను.
4 నేను ఆయన మాటలను కీర్తిస్తాను. నేను భయపడను. ఎందుకంటే దేవునిలో నమ్మకం పెట్టుకున్నాను. మనుషులు నన్నేమి చేయగలరు?
5 రోజంతా వాళ్ళు నా మాటల్లో తప్పులు వెతుకుతారు. నాకు ఎప్పుడు హాని చేయాలా అని చూస్తుంటారు.
6 వాళ్ళు గుంపులు గుంపులుగా కాపు కాస్తారు. నన్ను చంపాలని నన్ను వెంబడిస్తూ ఉంటారు.
7 దేవా, నీ కోపంతో ప్రజలను అణగదొక్కు. వాళ్ళు చేస్తున్న దుష్ట క్రియల ఫలితాలు అనుభవించేలా చెయ్యి.
8 నా పలాయనాలను నువ్వు లెక్కించావు. నా అశ్రువులు నీ ఎదుట ఉన్న సీసాలో నింపావు. అవన్నీ నీ పుస్తకంలో కనిపిస్తాయి కదా.
9 నేను నీకు మొరపెట్టిన రోజున నా శత్రువులు వెనక్కి మళ్లుతారు. దేవుడు నా పక్షాన ఉన్నాడని నాకు తెలుసు.
కీర్తన 56 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019