Text copied!
Bibles in Telugu

కీర్తన 50:13-18 in Telugu

Help us?

కీర్తన 50:13-18 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

13 ఎద్దుల మాంసం నేను తింటానా? మేకల రక్తం తాగుతానా?
14 దేవునికి నీ కృతజ్ఞతార్పణ సమర్పించు. మహోన్నతుడికి నీ ప్రమాణాలను నెరవేర్చు.
15 సమస్యలు చుట్టుముట్టిన రోజున నాకు ప్రార్థించు. నేను నిన్ను కాపాడతాను. నువ్వు నన్ను కీర్తిస్తావు.
16 కానీ దుర్మార్గులతో దేవుడు ఇలా అంటున్నాడు. నా నియమాలను ప్రకటించడానికి నీకేం పని? నా నిబంధన నీ నోట పలకాల్సిన అవసరం ఏమిటి?
17 ఆదేశాలను నువ్వు అసహ్యించుకుంటావు. నా మాటలు పట్టించుకోకుండా తోసివేస్తావు.
18 నువ్వు దొంగను చూసి వాడితో ఏకీభవిస్తావు. వ్యభిచారం చేసే వాళ్ళతో కలుస్తావు.
కీర్తన 50 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019