Text copied!
Bibles in Telugu

కీర్తన 18:8-15 in Telugu

Help us?

కీర్తన 18:8-15 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

8 ఆయన ముక్కు పుటాలనుంచి పొగ లేచింది. ఆయన నోట్లోనుంచి అగ్ని వచ్చి నిప్పులు రగిలించింది.
9 ఆయన ఆకాశాలను తెరిచి కిందకు వచ్చాడు. ఆయన పాదాల కింద చిమ్మచీకటి ఉంది.
10 కెరూబు మీద స్వారీ చేస్తూ ఆయన ఎగిరి వచ్చాడు. గాలి రెక్కల మీద ఆయన తేలి వచ్చాడు.
11 తన చుట్టూ అంధకారాన్ని, దట్టమైన వర్షమేఘాలను గుడారంగా చేశాడు.
12 ఆయన ఎదుట మెరుపులు, వడగళ్ళు, మండుతున్న నిప్పులు కురిసాయి.
13 యెహోవా ఆకాశంలో ఉరిమాడు! సర్వోన్నతుడు సింహనాదం చేసి వడగళ్ళు, మండుతున్న నిప్పులు కుమ్మరించాడు.
14 ఆయన తన బాణాలు ప్రయోగించి శత్రువులను చెదరగొట్టాడు. మెరుపులు మెండుగా మెరిపించి వాళ్ళను బెదరగొట్టాడు.
15 యెహోవా, నీ నాసికారంధ్రాల ఊపిరికి నీ సింహనాదానికి ప్రవాహాలు బయలు దేరాయి. భూమి పునాదులు బయటపడ్డాయి.
కీర్తన 18 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019