Text copied!
Bibles in Telugu

కీర్తన 18:4-25 in Telugu

Help us?

కీర్తన 18:4-25 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

4 మరణ పాశాలు నన్ను చుట్టుకున్నాయి, దుర్మార్గులు వరద ప్రవాహంలా నా మీద పడి నన్ను అణిచివేస్తున్నారు
5 పాతాళ పాశాలు నన్ను చుట్టుముట్టాయి. మరణపు ఉచ్చులు నన్ను చిక్కించుకున్నాయి.
6 నా బాధలో నేను యెహోవాకు మొరపెట్టాను. నాకు సహాయం చెయ్యమని దేవునికి ప్రార్థన చేశాను. ఆయన తన ఆలయంలోనుంచి నా స్వరం విన్నాడు, నా నివేదన ఆయన సన్నిధిలో ఆయన చెవిన పడింది.
7 అప్పుడు భూమి కంపించి వణికింది. దేవుడు కోపంగా ఉన్నాడు గనక పర్వతాల పునాదులు కూడా కదిలి వణికాయి.
8 ఆయన ముక్కు పుటాలనుంచి పొగ లేచింది. ఆయన నోట్లోనుంచి అగ్ని వచ్చి నిప్పులు రగిలించింది.
9 ఆయన ఆకాశాలను తెరిచి కిందకు వచ్చాడు. ఆయన పాదాల కింద చిమ్మచీకటి ఉంది.
10 కెరూబు మీద స్వారీ చేస్తూ ఆయన ఎగిరి వచ్చాడు. గాలి రెక్కల మీద ఆయన తేలి వచ్చాడు.
11 తన చుట్టూ అంధకారాన్ని, దట్టమైన వర్షమేఘాలను గుడారంగా చేశాడు.
12 ఆయన ఎదుట మెరుపులు, వడగళ్ళు, మండుతున్న నిప్పులు కురిసాయి.
13 యెహోవా ఆకాశంలో ఉరిమాడు! సర్వోన్నతుడు సింహనాదం చేసి వడగళ్ళు, మండుతున్న నిప్పులు కుమ్మరించాడు.
14 ఆయన తన బాణాలు ప్రయోగించి శత్రువులను చెదరగొట్టాడు. మెరుపులు మెండుగా మెరిపించి వాళ్ళను బెదరగొట్టాడు.
15 యెహోవా, నీ నాసికారంధ్రాల ఊపిరికి నీ సింహనాదానికి ప్రవాహాలు బయలు దేరాయి. భూమి పునాదులు బయటపడ్డాయి.
16 పైనుంచి చెయ్యి చాపి ఆయన నన్ను అందుకున్నాడు. దూసుకొచ్చే జలప్రవాహాలనుంచి నన్ను బయటకు లాగాడు.
17 నన్ను ద్వేషించే నా బలమైన శత్రువులనుంచి ఆయన నన్ను రక్షించాడు. ఎందుకంటే వాళ్ళను ఎదుర్కొనే బలం నాకు లేదు.
18 ఆపత్కాలంలో వాళ్ళు నా మీదకి వచ్చినప్పుడు యెహోవా నన్ను ఆదుకున్నాడు.
19 విశాలమైన స్థలానికి ఆయన నన్ను తీసుకు వచ్చాడు. నన్నుబట్టి ఆయన సంతోషించాడు గనక ఆయన నన్ను రక్షించాడు.
20 నా నిర్దోషత్వాన్నిబట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చాడు. నా చేతులు పరిశుభ్రంగా ఉన్నాయి గనక ఆయన నన్ను పునరుద్ధరించాడు.
21 ఎందుకంటే యెహోవా మార్గాలు నేను అనుసరించాను. దుర్మార్గంగా నేను నా దేవుణ్ణి విడిచిపెట్టలేదు.
22 ఆయన న్యాయవిధులన్నీ నా ఎదుట ఉన్నాయి. ఆయన శాసనాలనుంచి నేను వెనుదిరగలేదు.
23 పాపం నుంచి నేను దూరంగా ఉన్నాను. ఆయన దృష్టిలో నేను యథార్ధంగా ఉన్నాను.
24 కాబట్టి, నేను నిర్దోషిగా ఉన్న కారణంగా, తన దృష్టిలో నా చేతులు పరిశుభ్రంగా ఉన్న కారణంగా యెహోవా నన్ను పునరుద్ధరించాడు.
25 నిర్దోషుల పట్ల నిన్ను నువ్వు నిర్దోషివిగా కనపరచుకుంటావు. నమ్మదగిన వాళ్ళ పట్ల నువ్వు నమ్మదగిన వాడివిగా కనపరచుకుంటావు.
కీర్తన 18 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019