Text copied!
Bibles in Telugu

కీర్తన 18:24-30 in Telugu

Help us?

కీర్తన 18:24-30 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

24 కాబట్టి, నేను నిర్దోషిగా ఉన్న కారణంగా, తన దృష్టిలో నా చేతులు పరిశుభ్రంగా ఉన్న కారణంగా యెహోవా నన్ను పునరుద్ధరించాడు.
25 నిర్దోషుల పట్ల నిన్ను నువ్వు నిర్దోషివిగా కనపరచుకుంటావు. నమ్మదగిన వాళ్ళ పట్ల నువ్వు నమ్మదగిన వాడివిగా కనపరచుకుంటావు.
26 స్వచ్ఛంగా ఉన్నవాళ్ళ పట్ల నిన్ను నువ్వు స్వచ్ఛంగా కనపరచుకుంటావు. అయితే వక్రబుద్ధి గలవాళ్ళ పట్ల వికటంగా ఉంటావు.
27 బాధపడే వాళ్ళను నువ్వు రక్షిస్తావు. కాని, గర్వంతో కళ్ళు నెత్తికెక్కిన వాళ్ళను కిందకు అణిచి వేస్తావు!
28 నా దీపానికి వెలుగును ఇచ్చేవాడివి నువ్వే. నా దేవుడైన యెహోవా నా చీకటిని వెలుగుగా చేస్తాడు.
29 నీవల్ల నేను అడ్డంకులను అధిగమించగలను. నా దేవుని వల్ల అడ్డుగోడలు దూకగలను.
30 దేవుని విషయమైతే, ఆయన పరిపూర్ణుడు. యెహోవా వాక్కు స్వచ్ఛమైనది. ఆయనలో ఆశ్రయం పొందిన వాళ్లకు ఆయన ఒక డాలు.
కీర్తన 18 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019