Text copied!
Bibles in Telugu

కీర్తన 18:1-4 in Telugu

Help us?

కీర్తన 18:1-4 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

1 ప్రధాన సంగీతకారుని కోసం. దావీదు కీర్తన. సౌలునుంచీ, తన శత్రువులందరినుంచీ యెహోవా తనను విడిపించినప్పుడు యెహోవా సేవకుడైన దావీదు పాడిన స్తుతి కీర్తన యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను.
2 యెహోవా నా ఆశ్రయశిల, నా కోట, నన్ను రక్షించేవాడు, ఆయన నా దేవుడు, నా ఆశ్రయశిల. నేను ఆయనలో ఆశ్రయం పొందుతాను. ఆయన నా డాలు, నా రక్షణ కొమ్ము, నా బలమైన పట్టు.
3 స్తుతికి అర్హుడైన యెహోవాకు నేను నివేదన చేస్తాను, నేను నా శత్రువులనుంచి రక్షణ పొందుతాను.
4 మరణ పాశాలు నన్ను చుట్టుకున్నాయి, దుర్మార్గులు వరద ప్రవాహంలా నా మీద పడి నన్ను అణిచివేస్తున్నారు
కీర్తన 18 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019