Text copied!
Bibles in Telugu

కీర్తన 145:12-18 in Telugu

Help us?

కీర్తన 145:12-18 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

12 మహోన్నతమైన నీ రాజ్య ప్రాభవాన్ని, నీ శక్తి సామర్ధ్యాలను ప్రజలకు తెలపడానికి నీ బలప్రభావాలను గూర్చి మాట్లాడతారు.
13 నీ రాజ్యం కలకాలం ఉంటుంది. నీ రాజ్య పరిపాలన తరతరాలు నిలిచి ఉంటుంది.
14 కూలిపోతున్న వాళ్ళను యెహోవా స్థిరపరుస్తాడు. కృంగిన వాళ్ళను లేవనెత్తుతాడు.
15 జీవులన్నిటి కళ్ళు నీవైపే చూస్తున్నాయి. తగిన కాలంలో నువ్వు వాటికి ఆహారం పెడుతున్నావు.
16 నీ గుప్పిలి విప్పి ప్రతి ప్రాణి ఆకలి తీరుస్తున్నావు.
17 యెహోవా తన విధానాలన్నిటిలో నిజాయితీగా ప్రవర్తిస్తాడు. ఆయన తన కృప ద్వారా పనులు సఫలం చేస్తాడు.
18 ఆయన తనను వేడుకునే వాళ్ళందరికీ, తనకు యథార్ధంగా ప్రార్థన చేసే వాళ్ళందరికీ చేరువగా ఉన్నాడు.
కీర్తన 145 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019