Text copied!
Bibles in Telugu

కీర్తన 140:6-10 in Telugu

Help us?

కీర్తన 140:6-10 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

6 అయితే నేను యెహోవాతో ఇలా మనవి చేసుకుంటున్నాను, యెహోవా, నా దేవుడివి నువ్వే. నా విన్నపాలు ఆలకించు.
7 యెహోవా ప్రభూ, నువ్వే నాకు ఆశ్రయమిచ్చే కోట. యుద్ధ సమయంలో నా తలకు కాపు కాసే వాడివి నువ్వే.
8 యెహోవా, భక్తిహీనుల కోరికలను నేరవేర్చకు. వాళ్ళు మిడిసిపడకుండేలా వాళ్ళ పథకాలు భగ్నం చెయ్యి. సెలా.
9 నా చుట్టూ మూగిన వాళ్ళ తల మీదికి వాళ్ళ మాటల ద్వారా కీడు కలుగు గాక.
10 కణకణలాడే నిప్పులు వాళ్ళపై కురియాలి. వాళ్ళను అగ్నిగుండంలో పడవెయ్యి. ఎన్నటికీ లేవకుండా అగాధంలో పడవెయ్యి.
కీర్తన 140 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019