Text copied!
Bibles in Telugu

కీర్తన 132:11-18 in Telugu

Help us?

కీర్తన 132:11-18 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

11 నీ సంతానాన్ని నీ సింహాసనానికి శాశ్వత వారసులుగా చేస్తాను అనీ, దావీదు పట్ల నమ్మకంగా ఉంటాననీ ఆయన శపథం చేశాడు.
12 నీ కొడుకులు నా నిబంధన పాటిస్తే నేను నేర్పిన నా శాసనాలు అనుసరిస్తే ఇలా జరుగుతుంది, అన్నాడు.
13 తప్పనిసరిగా యెహోవా సీయోనును ఎన్నుకున్నాడు. దాన్ని తన నివాసస్థలంగా కోరుకున్నాడు.
14 ఇది నేను కోరుకున్న స్థలం. ఇది శాశ్వతంగా నా విశ్రాంతి స్థలంగా ఉంటుంది. ఇక్కడే నేను నివసిస్తాను.
15 దానిలో ఆహారం సమృద్ధిగా ఉండేలా దీవిస్తాను. దానిలోని పేదలను చాలినంత ఆహారంతో తృప్తి పరుస్తాను.
16 దాని యాజకులకు రక్షణ ధరింపజేస్తాను. దానిలో భక్తులు ఎలుగెత్తి హర్ష ధ్వానాలు చేస్తారు.
17 అక్కడే దావీదు వంశానికి చిగురు మొలకెత్తేలా చేస్తాను. అక్కడే నా అభిషిక్తుని కోసం నేను ఒక దీపం సిద్ధం చేసి ఉంచాను.
18 అతని శత్రువులు అవమానం ధరించుకునేలా చేస్తాను. అతని కిరీటం మాత్రం ప్రకాశిస్తుంది.
కీర్తన 132 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019