Text copied!
Bibles in Telugu

కీర్తన 119:99-106 in Telugu

Help us?

కీర్తన 119:99-106 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

99 నీ శాసనాలను నేను ధ్యానిస్తున్నాను కాబట్టి నా బోధకులందరికంటే నాకు ఎక్కువ అవగాహన ఉంది.
100 నీ ఉపదేశాలను నేను లక్ష్యపెడుతున్నాను గనక వయోవృద్ధుల కంటే నాకు విశేషజ్ఞానం ఉంది.
101 నేను నీ వాక్కుననుసరించేలా దుష్టమార్గాలన్నిటిలోనుండి నా పాదాలు తొలగించుకుంటున్నాను.
102 నీవు నాకు బోధించావు గనక నీ న్యాయవిధులనుండి నేను తొలగక నిలిచాను.
103 నీ వాక్కులు నా జిహ్వకు ఎంతో మధురం. అవి నా నోటికి తేనెకంటే తియ్యగా ఉన్నాయి.
104 నీ ఉపదేశం మూలంగా నాకు వివేకం కలిగింది. తప్పుమార్గాలన్నీ నాకు అసహ్యమనిపించాయి.
105 నూన్‌ నీ వాక్కు నా పాదాలకు దీపం, నా దారిలో వెలుగు.
106 నీ న్యాయవిధులను అనుసరిస్తానని నేను మాట ఇచ్చాను. దాన్ని నిలబెట్టుకుంటాను.
కీర్తన 119 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019