Text copied!
Bibles in Telugu

ఆమోసు 5:7-15 in Telugu

Help us?

ఆమోసు 5:7-15 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

7 వాళ్ళు న్యాయాన్ని భ్రష్టం చేసి, నీతిని నేలపాలు చేస్తున్నారు.
8 ఆయన నక్షత్ర మండలాలను చేసిన వాడు. చీకటిని తెలవారేలా చేసేవాడు. పగటిని రాత్రి చీకటిగా మార్చేవాడు. సముద్రపు నీటిని మబ్బుల్లాగా చేసి భూమి మీద కుమ్మరిస్తాడు.
9 ఆయన పేరు యెహోవా. బలవంతుల మీదికి ఆయన అకస్మాత్తుగా నాశనం రప్పిస్తే కోటలు నాశనమవుతాయి.
10 పట్టణ గుమ్మం దగ్గర బుద్ధి చెప్పే వారిని వాళ్ళు అసహ్యించుకుంటారు. యథార్థంగా మాట్లాడే వారిని ఏవగించుకుంటారు.
11 మీరు పేదలను అణగదొక్కుతూ ధాన్యం ఇమ్మని వారిని బలవంతం చేస్తారు, కాబట్టి మీరు చెక్కిన రాళ్ళతో ఇళ్ళు కట్టుకున్నా వాటిలో నివసించరు. మీకు చక్కటి ద్రాక్ష తోటలు ఉన్నా ఆ ద్రాక్ష మద్యం తాగరు.
12 మీ నేరాలెన్నో నాకు తెలుసు. మీ పాపాలు ఎంత భయంకరమైనవో నాకు తెలుసు. మీరు లంచాలు తీసుకుని తప్పుచేయని వారిని బాధిస్తారు. ఊరి గుమ్మం దగ్గర పేదలను పట్టించుకోరు.
13 అది గడ్డుకాలం గనక ఎలాంటి బుద్దిమంతుడైనా అప్పుడు ఊరుకుంటాడు.
14 మీరు బతికేలా చెడు విడిచి మంచి వెతకండి. అలా చేస్తే మీరనుకున్నట్టు యెహోవా, సేనల అధిపతి అయిన దేవుడు తప్పకుండా మీతో ఉంటాడు.
15 చెడును ద్వేషించి మంచిని ప్రేమించండి. పట్టణ గుమ్మాల్లో న్యాయాన్ని స్థిరపరచండి. ఒకవేళ యెహోవా, సేనల అధిపతి అయిన దేవుడు యోసేపు వంశంలో మిగిలిన వారిని కనికరిస్తాడేమో.
ఆమోసు 5 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019