Text copied!
Bibles in Telugu

అపొస్తలుల కార్యములు 24:7-12 in Telugu

Help us?

అపొస్తలుల కార్యములు 24:7-12 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

7 అయితే మీ సైనికాధికారి లూసియస్ వచ్చి బలవంతంగా పౌలును మా చేతుల్లోనుంచి విడిపించి తీసుకుపోయాడు.
8 వీటిని గురించి మీరు పౌలును ప్రశ్నిస్తే మేము ఇతని మీద మోపుతున్న నేరాలన్నీ వాస్తవమని మీకే అర్థం అవుతుంది.”
9 యూదులంతా ఏకీభవించి ఈ మాటలు నిజమే అని చెప్పారు.
10 అప్పుడు గవర్నర్, పౌలును మాట్లాడమని సైగ చేశాడు. పౌలు ఇలా అన్నాడు, “మీరు అనేక సంవత్సరాలుగా ఈ ప్రజలకు న్యాయాధిపతిగా ఉన్నారని తెలిసి నేను ధైర్యంగా జవాబు చెప్పుకుంటున్నాను.
11 నేను యెరూషలేములో ఆరాధించడానికి వెళ్ళి కేవలం పన్నెండు రోజులు మాత్రమే అయ్యిందని మీరు విచారించి తెలుసుకోవచ్చు.
12 దేవాలయంలోగానీ, సమాజ మందిరాల్లోగానీ, పట్టణంలోగానీ, నేను ఎవరితోనైనా తర్కించడం, లేదా ప్రజల మధ్య అల్లరి రేపడం ఎవరూ చూడలేదు.
అపొస్తలుల కార్యములు 24 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019