Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - సామెత - సామెత 18

సామెత 18:5-10

Help us?
Click on verse(s) to share them!
5దుష్టుడి పట్ల పక్షపాతం చూపుడం, నిర్దోషులకు అన్యాయం చేయడం భావ్యం కాదు.
6బుద్ధి లేని వాడి పెదాలు కలహానికి కాచుకుని ఉంటాయి. వాడి మాటలు దెబ్బల కోసం వెంపర్లాతాయి.
7మూర్ఖుడి నోరు వాడికే నాశన హేతువు. అతని మాటలే అతనికి ఉరి.
8కొండేలు చెప్పే వాడి మాటలు చవులూరించే భక్ష్యాలు. అవి హాయిగా కడుపులోకి దిగిపోతాయి.
9పనిలో సోమరిగా ఉండేవాడు నష్టం కలిగించే వాడికి అన్న.
10యెహోవా నామం బలమైన దుర్గం. నీతిపరుడు అందులో తలదాచుకుని సురక్షితంగా ఉంటాడు.

Read సామెత 18సామెత 18
Compare సామెత 18:5-10సామెత 18:5-10