Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - సంఖ్యా - సంఖ్యా 26

సంఖ్యా 26:4-31

Help us?
Click on verse(s) to share them!
4“20 సంవత్సరాలు, ఆ పై వయస్సు కలిగి, ఐగుప్తులోనుంచి బయటకు వచ్చిన వారిని లెక్కపెట్టమని యెహోవా ఆజ్ఞ ఇచ్చాడు” అన్నారు.
5ఇశ్రాయేలు పెద్దకొడుకు రూబేను. రూబేను కొడుకు హనోకు నుంచి హనోకీయులు హనోకు వంశస్థులు,
6పల్లువీయులు పల్లు వంశస్థులు. హెస్రోనీయులు హెస్రోను వంశస్థులు, కర్మీయులు కర్మీ వంశస్థులు.
7వీరు రూబేనీయుల వంశస్థులు. వారిల్లో లెక్కకు వచ్చినవారు 43, 730 మంది పురుషులు.
8పల్లు కొడుకు ఏలీయాబు. ఏలీయాబు కొడుకులు నెమూయేలు, దాతాను, అబీరాము.
9కోరహు, అతని సమాజం యెహోవాకు విరోధంగా వాదించినప్పుడు సమాజంలో మోషే అహరోనులకు విరోధంగా వాదించిన దాతాను అబీరాములు వీరే.
10ఆ సమాజం వారు చనిపోయినప్పుడు అగ్ని 250 మందిని కాల్చేసినందువల్ల, భూమి తన నోరు తెరచి వారిని, కోరహును మింగేసినందువల్ల, వారు ఒక హెచ్చరికగా అయ్యారు.
11అయితే కోరహు కొడుకులు చనిపోలేదు.
12షిమ్యోను కొడుకుల వంశంలో నెమూయేలీయులు నెమూయేలు వంశస్థులు, యామీనీయులు యామీను వంశస్థులు, యాకీనీయులు యాకీను వంశస్థులు,
13జెరహీయులు జెరహు వంశస్థులు, షావూలీయులు షావూలు వంశస్థులు.
14ఇవి షిమ్యోనీయుల వంశాలు. వారు 22, 200 మంది పురుషులు.
15గాదు కొడుకుల వంశాల్లో సెపోనీయులు సెపోను వంశస్థులు, హగ్గీయులు హగ్గీ వంశస్థులు, షూనీయులు షూనీ వంశస్థులు,
16ఓజనీయులు ఓజని వంశస్థులు, ఏరీయులు ఏరీ వంశస్థులు,
17ఆరోదీయులు ఆరోదు వంశస్థులు, అరేలీయులు అరేలీ వంశస్థులు.
18వీరు గాదీయుల వంశస్థులు. రాసిన వారి లెక్క ప్రకారం వీరు 40, 500 మంది పురుషులు.
19యూదా కొడుకులు ఏరు, ఓనాను. ఏరు, ఓనాను, కనాను ప్రదేశంలో చనిపోయారు.
20యూదావారి వంశాల్లో షేలాహీయులు షేలా వంశస్థులు, పెరెసీయులు పెరెసు వంశస్థులు, జెరహీయులు జెరహు వంశస్థులు,
21పెరెసీయుల్లో హెస్రోనీయులు హెస్రోను వంశస్థులు, హామూలీయులు హామూలు వంశస్థులు.
22వీరు యూదా వంశస్థులు. రాసిన వారి లెక్క ప్రకారం వీరు 76, 500 మంది పురుషులు.
23ఇశ్శాఖారు కొడుకుల వంశస్థుల్లో తోలాహీయులు తోలా వంశస్థులు, పువ్వీయులు పువ్వా వంశస్థులు, యాషూబీయులు యాషూబు వంశస్థులు, షిమ్రోనీయులు షిమ్రోను వంశస్థులు. వీరు ఇశ్శాఖారీయుల వంశస్థులు.
24రాసిన వారి లెక్క ప్రకారం వీరు 64, 300 మంది పురుషులు.
25జెబూలూను కొడుకుల వంశస్థుల్లో సెరెదీయులు సెరెదు వంశస్థులు,
26ఏలోనీయులు ఏలోను వంశస్థులు, యహలేలీయులు యహలేలు వంశస్థులు.
27రాసిన వారి లెక్క ప్రకారం వీరు 60, 500 మంది పురుషులు.
28యోసేపు వంశస్థులు అతని కొడుకులు మనష్షే, ఎఫ్రాయిము.
29మనష్షే కొడుకుల్లో మాకీరీయులు మాకీరు వంశస్థులు. మాకీరు గిలాదుకు తండ్రి. గిలాదీయులు గిలాదు వంశస్థులు. వీరు గిలాదు కొడుకులు.
30ఈజరీయులు ఈజరు వంశస్థులు, హెలకీయులు హెలకు వంశస్థులు,
31అశ్రీయేలీయులు అశ్రీయేలు వంశస్థులు, షెకెమీయులు షెకెము వంశస్థులు,

Read సంఖ్యా 26సంఖ్యా 26
Compare సంఖ్యా 26:4-31సంఖ్యా 26:4-31