Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - సంఖ్యా - సంఖ్యా 1

సంఖ్యా 1:9-20

Help us?
Click on verse(s) to share them!
9జెబూలూను గోత్రం నుండి హేలోను కొడుకు ఏలీయాబు.
10యోసేపు సంతానమైన ఎఫ్రాయిము గోత్రం నుండి అమీహూదు కొడుకు ఎలీషామాయు, మనష్షే గోత్రం నుండి పెదాసూరు కొడుకు గమలీయేలు,
11బెన్యామీను గోత్రం నుండి గిద్యోనీ కొడుకు అబీదాను,
12దాను గోత్రం నుండి అమీషద్దాయి కొడుకు అహీయెజెరు,
13ఆషేరు గోత్రం నుండి ఒక్రాను కొడుకు పగీయేలు,
14గాదు గోత్రం నుండి దెయూవేలు కొడుకు ఎలాసాపు
15నఫ్తాలి గోత్రం నుండి ఏనాను కొడుకు అహీర.”
16వీళ్ళంతా ప్రజల్లోనుండి నియమితులయ్యారు. వీరు తమ పూర్వీకుల గోత్రాలకు నాయకులుగానూ, ఇశ్రాయేలు ప్రజల తెగలకు పెద్దలుగానూ ఉన్నారు.
17ఈ పేర్లతో ఉన్న వ్యక్తులను మోషే అహరోనులు పిలిచారు.
18వీళ్ళతో పాటు ఇశ్రాయేలు ప్రజల్లో పురుషులందరినీ రెండో నెల మొదటి రోజున సమావేశపర్చారు. ఇరవై ఏళ్ళూ ఆ పై వయసున్న వారు తమ తమ వంశాలనూ, పూర్వీకుల కుటుంబాలనూ తమ తెగల పెద్దల పేర్లనూ తెలియజేసారు.
19అప్పుడు యెహోవా తనకాజ్ఞాపించినట్టుగా సీనాయి అరణ్యంలో మోషే వారి సంఖ్య నమోదు చేశాడు.
20ఇశ్రాయేలు మొదటి కొడుకు రూబేను సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.

Read సంఖ్యా 1సంఖ్యా 1
Compare సంఖ్యా 1:9-20సంఖ్యా 1:9-20