Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - లేవీ - లేవీ 5

లేవీ 5:9-19

Help us?
Click on verse(s) to share them!
9అతడు కొంత రక్తాన్ని బలిపీఠం పక్కన చిలకరించాలి. మిగిలిన రక్తాన్ని బలిపీఠం అడుగున కుమ్మరించాలి. ఇది పాపం కోసం చేసే బలి.
10తరువాత ఆదేశాల్లో చెప్పినట్టు రెండో పక్షిని దహనబలిగా అర్పించాలి. అతడు చేసిన పాపం కోసం యాజకుడు పరిహారం చేస్తాడు. అప్పుడు అతనికి క్షమాపణ కలుగుతుంది.
11ఒకవేళ అతనికి రెండు గువ్వలను, రెండు పావురం పిల్లలను కొని తెచ్చే స్తోమతు లేకపోతే, అతడు తన పాపం కోసం అర్పణగా ఒక కిలో సన్నని గోదుమ పిండిని తీసుకురావాలి. అది పాపం కోసం చేసే అర్పణ కాబట్టి దాని మీద నూనె పోయకూడదు, ఎలాంటి సాంబ్రాణి వేయకూడదు.
12అతడు యాజకుని దగ్గరికి దాన్ని తీసుకురావాలి. అప్పుడు యాజకుడు యెహోవా మంచితనం గూర్చి కృతజ్ఞతాపూర్వకంగా జ్ఞాపకం చేసుకోడానికి దానిలో నుండి ఒక గుప్పెడు స్మృతి చిహ్నంగా తీసి యెహోవాకి దహనబలి అర్పించే చోట దహించాలి. అది పాపం కోసం చేసే బలి అర్పణ.
13పైన చెప్పిన వాటిలో అతడు చేసిన పాపాన్ని యాజకుడు కప్పివేస్తాడు. అప్పుడు అతనికి క్షమాపణ కలుగుతుంది. నైవేద్యం అర్పణలో మిగిలినది యాజకునికి చెందినట్టుగా ఇక్కడ కూడా అర్పణ చేయగా మిగిలినది యాజకునికి చెందుతుంది.”
14తరువాత యెహోవా మోషేకు ఇంకా ఇలా చెప్పాడు.
15“ఒక వ్యక్తి యెహోవాకు అర్పితమైన వాటిని ముందు పొరపాటుగా ఆయనకు చెల్లించకుండా తెలియక ఆజ్ఞను అతిక్రమించి పాపం చేస్తే, అప్పుడు అతడు తన అపరాధ బలి అర్పణను యెహోవా దగ్గరికి తీసుకు రావాలి. అతడు తన అపరాధ బలిగా మందలో నుండి లోపం లేని పొట్టేలును తీసుకురావాలి. ఆ పొట్టేలు విలువను ప్రత్యక్ష గుడారంలో చెలామణీ అయ్యే వెండితో నిర్ణయించాలి.
16పరిశుద్ధమైన వస్తువు విషయంలో తాను చేసిన తప్పుకు నష్ట పరిహారం చెల్లించాలి. దానికి ఐదో వంతు చేర్చి దాన్ని యాజకుడికి ఇవ్వాలి. అప్పుడు యాజకుడు అపరాధ బలి అర్పణ అయిన పొట్టేలుతో అతని కోసం పరిహారం చేస్తాడు. అప్పుడు ఆ వ్యక్తికి క్షమాపణ కలుగుతుంది.
17ఎవరైనా చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన దాన్ని చేసి పాపం చేస్తే, అది పొరపాటుగా చేసినా అపరాధి అవుతాడు. దానికి శిక్ష పొందుతాడు.
18అతడు తన అపరాధ బలి అర్పణగా మందలో నుండి లోపం లేని పొట్టేలును తీసుకు రావాలి. దాని ప్రస్తుత వెల నిర్ణయం జరగాలి. దాన్ని అపరాధ బలి అర్పణగా యాజకుడి దగ్గరికి తీసుకురావాలి. అప్పుడు యాజకుడు పొరపాటుగా ఆ వ్యక్తి చేసిన పాపం కోసం పరిహారం చేస్తాడు. అప్పుడు అతనికి క్షమాపణ కలుగుతుంది.
19అది అపరాధబలి. అతడు నిజంగానే యెహోవా ఎదుట దోషి అయ్యాడు.”

Read లేవీ 5లేవీ 5
Compare లేవీ 5:9-19లేవీ 5:9-19