Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - ప్రసంగి - ప్రసంగి 10

ప్రసంగి 10:14-19

Help us?
Click on verse(s) to share them!
14ఏమి జరగబోతున్నదో తెలియకపోయినా మూర్ఖులు అతిగా మాట్లాడతారు. మనిషి చనిపోయిన తరవాత ఏం జరుగుతుందో ఎవరు చెబుతారు?
15మూర్ఖులు తాము వెళ్ళాల్సిన దారి తెలియనంతగా తమ కష్టంతో ఆయాసపడతారు.
16ఒక దేశానికి బాలుడు రాజుగా ఉండడం, ఉదయాన్నే భోజనానికి కూర్చునే వారు అధిపతులుగా ఉండడం అరిష్టం.
17అలా కాక దేశానికి రాజు గొప్ప ఇంటివాడుగా, దాని అధిపతులు మత్తు కోసం కాక బలం కోసం సరైన సమయంలో భోజనానికి కూర్చునే వారుగా ఉండడం శుభకరం.
18సోమరితనం ఇంటికప్పు దిగబడిపోయేలా చేస్తుంది. చేతులు బద్ధకంగా ఉంటే ఆ ఇల్లు కురుస్తుంది.
19విందు వినోదాలు మనకి నవ్వు, ఆనందం పుట్టిస్తాయి. ద్రాక్షారసం ప్రాణాలకి సంతోషం ఇస్తుంది. ప్రతి అవసరానికి డబ్బు తోడ్పడుతుంది.

Read ప్రసంగి 10ప్రసంగి 10
Compare ప్రసంగి 10:14-19ప్రసంగి 10:14-19