Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - న్యాయా - న్యాయా 5

న్యాయా 5:3-18

Help us?
Click on verse(s) to share them!
3రాజులారా వినండి! అధికారులారా ఆలకించండి! నేను యెహోవాకు కీర్తన పాడుతాను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు నేను స్తుతుల కీర్తన పాడుతాను.
4యెహోవా, నువ్వు శేయీరు నుంచి బయలుదేరినప్పుడు, ఎదోము పొలం నుంచి యుద్ధానికి బయలుదేరినప్పుడు, భూమి కంపించింది. ఆకాశం వణికింది. మేఘాలు నీళ్ళు కుమ్మరించాయి.
5యెహోవా సముఖంలో కొండలు కంపించాయి. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సముఖంలో సీనాయి కొండ కూడా కంపించింది.
6అనాతు కొడుకు షమ్గరు దినాల్లో యాయేలు దినాల్లో రాజమార్గాలు ఎడారులుగా మారాయి. ప్రయాణికులు ఎవరూ నడవని పక్క త్రోవల్లోనే నడిచారు.
7దెబోరా అనే నేను రాకముందు, ఇశ్రాయేలీయుల్లో పనివాళ్ళు లేకుండా పోయారు. ఒక తల్లి ఇశ్రాయేలీయులకు నాయకత్వం వహించ వలసి వచ్చింది!
8ఇశ్రాయేలీయులు కొత్త దేవుళ్ళను ఎంపిక చేసుకున్నారు. యుద్ధం వాళ్ళ ముఖ ద్వారాల దగ్గరికి వచ్చింది. ఇశ్రాయేలీయుల్లో నలభై వేలమందిలో ఒక్కడికైనా ఒక డాలే గానీ ఒక ఈటె గానీ కనిపించలేదు.
9ఇశ్రాయేలీయుల అధిపతులు సంతోషంగా తమకైతాముగా యుద్ధానికి సిద్ధపడ్డారు. వారిని బట్టి యెహోవాను స్తుతించండి!
10తెల్ల గాడిదల మీద స్వారీ చేసేవారూ, తివాచీల మీద కూర్చునేవారూ, త్రోవల్లో నడిచేవారూ, ఇది వినండి!
11పశువులు నీళ్ళు తాగే చోట విల్లుకాండ్రు చేసే స్వరాలు వినండి. యెహోవా నీతిక్రియల గురించి వాళ్ళు చెబుతున్నారు. ఇశ్రాయేలీయుల యుద్ధశూరులకు తమ శత్రువుల మీద ఆయన జయం ఇచ్చాడని వాళ్ళు చెబుతున్నారు. “యెహోవా ప్రజలు పట్టణ ద్వారాల దగ్గరికి కవాతుగా వెళ్ళారు.
12మేలుకో, మేలుకో దెబోరా, మేలుకో, మేలుకో, కీర్తన పాడు! బారాకూ వెళ్ళు, అబీనోయము కుమారా, వెళ్ళు. నీ శత్రువులను బంధించు.
13ప్రాణాలతో ఉన్న కొందరు ఇశ్రాయేలు ప్రజలు తాబోరు కొండ దిగి ప్రముఖుల దగ్గరికి వచ్చారు. యెహోవా ప్రజలు యుద్ధ శూరులతో ఉన్న నా దగ్గరికి వచ్చారు.
14కొందరు ఎఫ్రాయీము నుంచి వచ్చినవాళ్ళు. వాళ్ళు ఒకప్పుడు అమాలేకీయుల దేశ నివాసులు. బెన్యామీనీయుల ప్రజలు నీ వెంటే వచ్చారు. మాకీరు నుంచి న్యాయాధిపతులు, జెబూలూనీయుల నుంచి నాయకదండం మోసేవాళ్ళూ వచ్చారు.
15ఇశ్శాఖారులోని అధిపతులు దెబోరాతో కలిసి వచ్చారు. ఇశ్శాఖారీయులు బారాకుతో కలిసి అతివేగంగా లోయలోకి చొరబడ్డారు. రూబేనీయుల తెగలవారికి గొప్ప హృదయాన్వేషణలు కలిగాయి.
16గొర్రెల మందల కోసం కాపరులు వాయించే ఈలలు వినడానికి నీ గొర్రెల దొడ్ల మధ్య నువ్వెందుకు ఉన్నావు? రూబేనీయుల తెగల వారికి గొప్ప హృదయాన్వేషణలు కలిగాయి.
17గిలాదువారు యొర్దాను అవతల ప్రాంతాల్లో నివాసం ఉన్నారు. దానీయులు ఓడల్లో ఎందుకు తిరుగుతున్నారు? ఆషేరీయులు సముద్రతీరాన తమ ఓడరేవుల్లో ఎందుకు ఉన్నారు?
18జెబూలూనీయులకు మరణభయం లేదు. వారు ప్రాణాలు సైతం లెక్కచెయ్యని ప్రజలు. నఫ్తాలీయులు కూడా యుద్ధభూమిలో ప్రాణాలు లెక్క చెయ్యలేదు.

Read న్యాయా 5న్యాయా 5
Compare న్యాయా 5:3-18న్యాయా 5:3-18