Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - న్యాయా - న్యాయా 10

న్యాయా 10:9-18

Help us?
Click on verse(s) to share them!
9ఇంక అమ్మోనీయులు యూదాదేశస్థులతో బెన్యామీనీయులతో ఎఫ్రాయిమీయులతో యుద్ధం చెయ్యడానికి యొర్దాను దాటినందువల్ల ఇశ్రాయేలీయులకు గడ్డు పరిస్థితులు దాపురించాయి.
10అప్పుడు ఇశ్రాయేలీయులు “మేము నీ దృష్టిలో పాపం చేశాం. మా దేవుణ్ణి విడిచి బయలులను పూజించాం” అని యెహోవాకు మొర్రపెట్టారు.
11యెహోవా “ఐగుప్తీయుల వశంలో నుంచి, అమోరీయుల వశంలో నుంచి, అమ్మోనీయుల వశంలో నుంచి, ఫిలిష్తీయుల వశంలో నుంచి మాత్రమే కాకుండా
12సీదోనీయులు, అమాలేకీయులు, మాయోనీయులు మిమ్మల్ని బాధ పరచినప్పుడు వాళ్ళ వశంలో నుంచి కూడా నేను మిమ్మల్ని రక్షించాను కదా,
13అయితే మీరు నన్ను విడిచిపెట్టి, ఇతర దేవుళ్ళను పూజించారు గనుక నేను ఇక మిమ్మల్ని రక్షించను.
14మీరు వెళ్లి, మీరు కోరుకొన్న దేవుళ్ళకు మొర్ర పెట్టుకోండి. మీ బాధకాలంలో అవి మిమ్మల్ని రక్షిస్తాయేమో” అని ఇశ్రాయేలీయులతో అన్నాడు.
15అప్పుడు ఇశ్రాయేలీయులు “మేము పాపం చేశాము, నీ దృష్టికి ఏది ఇష్టమో దాని ప్రకారం మాకు చెయ్యి. దయచేసి ఈ రోజు మమ్మల్ని రక్షించు” అని చెప్పి,
16యెహోవాను సేవించడానికి వాళ్ళ మధ్య ఉన్న ఇతర దేవుళ్ళను తొలగించివేసారు. ఆయన ఆత్మ ఇశ్రాయేలీయులకు కలిగిన దురవస్థను చూసి సహించలేక పోయింది.
17అప్పుడు అమ్మోనీయులు గిలాదులో శిబిరం వేసుకుని ఉన్నారు. ఇశ్రాయేలీయులు మిస్పాలో సమకూడి ఉన్నారు.
18కాబట్టి ప్రజలు, అంటే గిలాదు పెద్దలు “అమ్మోనీయులతో యుద్ధం చెయ్యడానికి పూనుకొన్నవాడు ఎవడో, అతడు గిలాదు నివాసులకందరికీ ప్రధాని అవుతాడు” అని ఒకడితో ఒకడు చెప్పుకున్నారు.

Read న్యాయా 10న్యాయా 10
Compare న్యాయా 10:9-18న్యాయా 10:9-18