Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - కీర్తన - కీర్తన 94

కీర్తన 94:2-19

Help us?
Click on verse(s) to share them!
2లోక న్యాయమూర్తీ, లే! గర్విష్టులకు తగినట్టుగా ప్రతిఫలం ఇవ్వు.
3యెహోవా, దుర్మార్గులు ఎంతకాలం, ఎంతకాలం గెలుస్తారు?
4వాళ్ళు గర్వంగా తిరస్కారంగా మాట్లాడుతున్నారు. వాళ్ళంతా గొప్పలు చెప్పుకుంటున్నారు.
5యెహోవా, వాళ్ళు నీ ప్రజలను అణిచివేస్తున్నారు. నీకు చెందిన జాతిని బాధిస్తున్నారు.
6వాళ్ళు వితంతువులనూ విదేశీయులనూ చంపేస్తున్నారు. అనాథలను హత్య చేస్తున్నారు.
7వారు యెహోవా చూడడు, యాకోబు దేవుడు ఇదంతా గమనించడు, అంటారు.
8బుద్ధిలేని ప్రజలారా, తెలుసుకోండి. మూర్ఖులారా, మీరెప్పుడు నేర్చుకుంటారు?
9చెవులిచ్చినవాడు వినలేడా? కళ్ళు చేసినవాడు చూడలేడా?
10రాజ్యాలను అదుపులో పెట్టేవాడు సరిచేయడా? మనిషికి తెలివి ఇచ్చేవాడు ఆయనే.
11మనుషుల ఆలోచనలు యెహోవాకు తెలుసు, అవి పనికిరానివని ఆయనకు తెలుసు.
12యెహోవా, నీ దగ్గర శిక్షణ పొందేవాడు నీ ధర్మశాస్త్రంలో నుంచి నీ దగ్గర నేర్చుకునేవాడు ధన్యుడు.
13దుర్మార్గులకు గుంట తవ్వే వరకూ అతని కష్టకాలాల్లో నువ్వు నెమ్మది ఇస్తావు.
14యెహోవా తన ప్రజలను విడిచిపెట్టడు. తన సొత్తును వదిలి పెట్టడు.
15న్యాయం గెలుస్తుంది, నిజాయితీపరులంతా దాన్ని అనుసరిస్తారు.
16దుర్మార్గుల ఎదుట నా పక్షాన ఎవరు నిలబడతారు? దుష్టులకు వ్యతిరేకంగా నా కోసం ఎవరు నిలుస్తారు?
17యెహోవా నాకు సాయం రాకపోతే నేను మరణనిశ్శబ్దంలో పండుకునే వాడినే.
18నా కాలు జారింది అని నేనంటే, యెహోవా, నీ కృప నన్ను ఎత్తిపట్టుకుంది.
19నా లోని ఆందోళనలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేసి నన్ను బెదిరిస్తుంటే, నీ గొప్ప ఆదరణ నా ప్రాణానికి నెమ్మది కలగచేసింది.

Read కీర్తన 94కీర్తన 94
Compare కీర్తన 94:2-19కీర్తన 94:2-19