16దుర్మార్గుల ఎదుట నా పక్షాన ఎవరు నిలబడతారు? దుష్టులకు వ్యతిరేకంగా నా కోసం ఎవరు నిలుస్తారు?
17యెహోవా నాకు సాయం రాకపోతే నేను మరణనిశ్శబ్దంలో పండుకునే వాడినే.
18నా కాలు జారింది అని నేనంటే, యెహోవా, నీ కృప నన్ను ఎత్తిపట్టుకుంది.
19నా లోని ఆందోళనలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేసి నన్ను బెదిరిస్తుంటే, నీ గొప్ప ఆదరణ నా ప్రాణానికి నెమ్మది కలగచేసింది.