Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - కీర్తన - కీర్తన 94

కీర్తన 94:15-23

Help us?
Click on verse(s) to share them!
15న్యాయం గెలుస్తుంది, నిజాయితీపరులంతా దాన్ని అనుసరిస్తారు.
16దుర్మార్గుల ఎదుట నా పక్షాన ఎవరు నిలబడతారు? దుష్టులకు వ్యతిరేకంగా నా కోసం ఎవరు నిలుస్తారు?
17యెహోవా నాకు సాయం రాకపోతే నేను మరణనిశ్శబ్దంలో పండుకునే వాడినే.
18నా కాలు జారింది అని నేనంటే, యెహోవా, నీ కృప నన్ను ఎత్తిపట్టుకుంది.
19నా లోని ఆందోళనలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేసి నన్ను బెదిరిస్తుంటే, నీ గొప్ప ఆదరణ నా ప్రాణానికి నెమ్మది కలగచేసింది.
20దుర్మార్గ పాలకులు నీతో జత కట్టగలరా? అన్యాయం చేద్దామని వాళ్ళు చట్టం కల్పిస్తారు.
21వాళ్ళు నీతిమంతులకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతారు. నిర్దోషులకు మరణ దండన విధిస్తారు.
22అయితే యెహోవా నాకు ఎత్తయిన కోట. నా దేవుడు నాకు ఆశ్రయదుర్గం.
23ఆయన వాళ్ళ దోషం వాళ్ళ మీదికి రప్పిస్తాడు. వాళ్ళ చెడుతనంలోనే వాళ్ళను నాశనం చేస్తాడు. మన యెహోవా దేవుడు వాళ్ళను నాశనం చేస్తాడు.

Read కీర్తన 94కీర్తన 94
Compare కీర్తన 94:15-23కీర్తన 94:15-23