Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - కీర్తన - కీర్తన 77

కీర్తన 77:9-17

Help us?
Click on verse(s) to share them!
9దేవుడు కనికరించడం మరచిపోయాడా? ఆయన కోపం దయకు అడ్డుపడిందా? సెలా
10ఇది నా బాధ. మా పట్ల సర్వశక్తుని కుడి చెయ్యి మారుతూ ఉంది, అని నేనన్నాను.
11అయితే యెహోవా, గతంలోని నీ అద్భుత క్రియలను నేను గుర్తుకు తెచ్చుకుంటాను.
12నీ పనులన్నిటినీ నేను తలంచుకుంటాను. వాటిని మననం చేసుకుంటాను.
13దేవా! నీ మార్గం పవిత్రం. మన గొప్ప దేవునికి సాటి అయిన దేవుడెవరు?
14నువ్వు అద్భుతాలు చేసే దేవుడివి, ప్రజా సమూహాల్లో నువ్వు నీ ప్రభావాన్ని ప్రత్యక్షపరచావు.
15నీ గొప్ప బలంతో నీ ప్రజలకు-యాకోబు యోసేపుల సంతతికి విజయాన్నిచ్చావు. సెలా
16దేవా, నీళ్ళు నిన్ను చూశాయి, నీళ్ళు నిన్ను చూసి భయపడ్డాయి, అగాధంలోని నీళ్ళు వణికిపోయాయి.
17మబ్బులు నీళ్లు కుమ్మరించాయి, ఆకాశం గర్జించింది, నీ బాణాలు రివ్వున ఎగిశాయి.

Read కీర్తన 77కీర్తన 77
Compare కీర్తన 77:9-17కీర్తన 77:9-17