Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - కీర్తన - కీర్తన 148

కీర్తన 148:5-14

Help us?
Click on verse(s) to share them!
5అవన్నీ యెహోవా నామాన్ని స్తుతిస్తాయి గాక. ఎందుకంటే యెహోవా ఆజ్ఞ ఇచ్చినప్పుడు అవన్నీ ఏర్పడ్డాయి.
6ఆయన వాటికి శాశ్విత నివాస స్థానాలు ఏర్పాటు చేశాడు. ఆయన వాటికి శాసనాలు నియమించాడు. ప్రతిదీ వాటికి లోబడక తప్పదు.
7భూమి మీద సృష్టి అయిన ప్రతి వస్తువూ ఆయనను స్తుతించాలి. సముద్రంలో ఉన్న అగాధజలాల్లారా, యెహోవాను స్తుతించండి.
8అగ్నిపర్వతాలూ, వడగళ్ళూ, మంచూ, ఆవిరీ, ఆయన ఆజ్ఞను నెరవేర్చే తుఫానూ, యెహోవాను స్తుతించండి.
9పర్వతాలూ, ఎన్నెన్నో కొండలూ, ఫలాలిచ్చే చెట్లూ, అన్ని దేవదారు వృక్షాలూ యెహోవాను స్తుతించండి.
10మృగాలూ, పశువులూ, నేల మీద పాకే జీవులూ, రెక్కలతో ఎగిరే పక్షులూ యెహోవాను స్తుతించండి.
11భూరాజులూ, సమస్త ప్రజల సమూహాలూ, భూమిపై ఉన్న అధిపతులూ, సమస్త న్యాయాధిపతులూ యెహోవాను స్తుతించండి.
12యువకులు, కన్యలు, వృద్ధులు, బాలబాలికలు అందరూ యెహోవా నామాన్ని స్తుతిస్తారు గాక.
13ఆయన నామం మాత్రమే మహోన్నతమైనది. ఆయన ప్రభావం భూమి కంటే, ఆకాశం కంటే ఉన్నతమైనది.
14ఆయన తన ప్రజలకు రెట్టింపు ఘనత కలిగించాడు. అది ఆయన భక్తులకు, ఆయన శరణు కోరిన ఇశ్రాయేలు ప్రజలకు గర్వకారణంగా ఉన్నది. యెహోవాను స్తుతించండి.

Read కీర్తన 148కీర్తన 148
Compare కీర్తన 148:5-14కీర్తన 148:5-14